Telugu

ఎలాంటి అవగాహన లేకుండా త్రివిక్రమ్ రాసేస్తాడు!

‘మాటల మాంత్రికుడు’గా పేరుగాంచిన త్రివిక్రమ్ డైలాగ్స్ ను ఇప్పటివరకు విమర్శించిన వారు లేరు. కానీ తాజాగా వైసీపీ నేత రోజా మాత్రం త్రివిక్రమ్ ఎలాంటి అవగాహన లేకుండా డైలాగ్స్ రాసేస్తారు అంటూ ఓ విమర్శ చేసింది. అయితే ఇది సినిమాలకు సంబంధించి కాదులేండి.

ADVERTISEMENT

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో… పనిలో పనిగా త్రివిక్రమ్ పై కూడా ఓ డైలాగ్ వేసేసింది. పవన్ పొలిటికల్ స్పీచ్ లన్నీ త్రివిక్రమ్ రాసిస్తారని ఉన్న టాక్ తెలియనిది కాదు. ఇందులో వాస్తవం ఎంత ఉన్నా గానీ, వినడానికి అవి త్రివిక్రమ్ మాటల్లో ఉన్నంత భావం ఉండడంతో, ఆ వార్తలకు బలం చేకూరుతోంది.

అయితే త్రివిక్రమ్ కు అసలు రాజకీయ అవగాహన లేదు, అలాంటప్పుడు ఆయన రాసే డైలాగ్స్ విలువ ఏముంటుంది? వాటిని పవన్ పలికితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? అన్న కోణంలో రోజా తన భావాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. మరి దీనిపై పవన్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ఇచ్చట అన్ని చేదు నిజాలే చెప్పబడును: కవిత

భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…

9 minutes ago

31 Years Of CM CBN: What a Journey It Is!

Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…

17 minutes ago