Telugu

రోజా వచ్చింది… నోటికి పని చెప్పింది..!

ఇటీవల కాలంలో మీడియాకు కాస్త దూరంగా ఉన్న వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీపై, ఏపీ సిఎంపై విమర్శలు వర్షం కురిపించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే కానీ, రోజా మాటలు మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ చర్చలకు దారి తీస్తాయి. ఆ రేంజ్ లో నోటికి పని చెప్పే రోజా ఈ సారి కూడా తన స్థాయికి తగ్గ రీతిలోనే, మరో ఆలోచనలకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించారు.

‘రైల్వే జోన్ – విశాఖ హక్కు’ అంటూ చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన సందర్భంగా వ్యాఖ్యానించిన రోజా… ‘తెలుగుదేశం పార్టీలో మగాళ్ళే లేరంటూ’ తీవ్ర పదజాలాన్ని వినియోగించింది. టీడీపీలో మగాళ్లు లేక వైఎస్సార్సీపీకి చెందిన నేతలను ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని, చంద్రబాబుకు దమ్ముంటే, ఆయనే కనక రాయలసీమ బిడ్డ అయితే తక్షణం వారందర్నీ పదవులకు రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. విభజన చట్టంలో రైల్వే జోన్ విశాఖకు వస్తుందని పేర్కొన్నారని, చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని విమర్శించారు.

ADVERTISEMENT

గతంలో ఇలాంటి ‘దురుసు’ వ్యాఖ్యలే అసెంబ్లీ వేదికగా ప్రసంగించి ఒక సంవత్సరం పాటు సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ అయ్యారు. ఓ పక్కన దీనిపై విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో మరోసారి అలాంటి విమర్శలకు తావిచ్చే పలుకులే పలకడం బహుశా రోజాకు మాత్రమే చెల్లుతుందేమో అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సినీ లెవల్లో ‘మగాళ్ళు, రాయలసీమ బిడ్డ’ అంటూ వ్యాఖ్యానించడం… బహుశా తన సినీ పరిభాషపై పట్టు కోల్పోలేదని చాటిచెప్పడానికేమో… అన్న వాదన తెరపైకి వస్తోంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ఏపీ కాంగ్రెస్‌.. రాజకీయ ఉద్యోగ కల్పనకు మాత్రమేనా?

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…

50 minutes ago

Antha Ramuloru Choosukuntaru Glimpse Draws Attention

Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…

2 hours ago