
ఈ చిత్రం విడుదలకు ముందు టీమ్ ప్రమోషన్ చేస్తోంది… అయితే సాధారణ ప్రమోషన్స్ గా కాకుండా ఆన్ లైన్ లో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా కథ హైదరాబాద్లో నిజంగా జరిగిన రెండు సంఘటనల ఆధారంగా రాయబడిందని దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
“నేను ఈ కథను 2006 లోనే వ్రాసాను, కాని సరైన బడ్జెట్, టెక్నాలజీ మరియు నటీనటులు దొరక్కనేను దానిని చేయలేకపోయాను. అయితే ఇప్పటి కాలానికి అనుగుణంగా కథలో కొన్ని మార్పులు చేసాను. సినిమా విడుదల తర్వాత ప్రతిదీ వివరంగా చెబుతాను. ఇప్పుడు చెబితే స్టోరీ తెలిసిపోతుంది”, అని ఇంద్రగంటి అన్నారు.
ఈ సినిమాలో నాని నెగటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. సుధీర్ బాబు ఒక సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా, అలాగే నాని ఒక సైకో కిల్లర్ గా కనిపిస్తాడు. ఉగాదిలో విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఆన్ లైన్ రిలీజ్ తో కూడా నిర్మాత దిల్ రాజు లాభాలతో బయటపడటం విశేషం.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…