Telugu

‘బిజెపి’ తరపున బరిలోకి దిగిన ‘సూపర్ స్టార్’

‘ఏనాటి బంధమీ అనురాగం… ఏనాటి బంధమీ అనుబంధం…’ అన్నంతగా రాజకీయాలకు – సినీ సెలబ్రిటీలకు సంబంధం పెనవేసుకుపోయింది. ఎక్కడ, ఎవరి గమ్యం చూసినా దాదాపు 90 శాతం సినీ సెలబ్రిటీల చివరి అంకం రాజకీయాల వైపుకే మళ్ళుతోంది. తాజాగా ఈ జాబితాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా చేరిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తరపున వకాల్తా పుచ్చుకున్న మోహన్ లాల్ ప్రచారం కూడా ప్రారంభించారు.

ADVERTISEMENT

కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని సర్వశక్తులూ ఒడ్డుతున్న మోడీ సర్కార్, తాజాగా ప్రచారానికి మోహన్ లాల్ ను బరిలోకి దింపింది. సూపర్ స్టార్ స్టేటస్ కలిగిన హీరోగా మోహన్ లాల్ ఫాలోయింగ్ తెలియనిది కాదు. దానికి తగిన విధంగానే మోహన్ లాల్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజా స్పందన వెల్లువెత్తింది. అయితే ఎప్పుడూ వ్యక్తమయ్యే ప్రశ్నే… ఈ సూపర్ స్టార్ ను వీక్షించడానికి వచ్చిన జనులంతా చివరికి ఓట్లు వేస్తారా? అన్నది శేష ప్రశ్నే..!

కేరళ ఎన్నికలలో మాజీ టీమిండియా సభ్యుడు, ఫాస్ట్ బౌలర్ అయిన శ్రీశాంత్ బరిలో నింపి, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన బిజెపి, తాజాగా స్టార్ హీరోను కూడా తమ ప్రచారానికి వినియోగించుకుంటోంది. అయితే ఇన్ని చేసినా చివరికి ఫలితం అనుకూలంగా వస్తుందా అంటే… అది సందేహాస్పదమే..!

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Soori-Suhas Film Suddenly Becomes Crucial for Suriya?

Following the commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is currently starring as…

27 minutes ago

Announced Dates. Now Comes the Back-Off!

Tollywood’s release calendar is getting a little messy. As per the buzz, around four films…

57 minutes ago