
నేను బీజేపీలో చేరుతున్నా అని కొందరు పేలుతున్నారు. ఎవరు ఎవరి సంక నాకుతున్నారో నిన్న మొన్న మీడియాలో చూశాం. తాము మంత్రులం అయిపోయామని… వైసీపీ నేతలు బుస్సు కబుర్లు చెప్పుకుంటున్నారు. నవంబర్‌లో జరిగే కేంద్రమంత్రివర్గ విస్తరణ వరకు ఇలాగే ప్రచారం చేసుకుంటారు. అన్నీ అబద్ధాలే అని నవంబర్‌లో తేలుతుంది,” అని ఆయన అన్నారు.
“ఎవరితోనూ జట్టుకట్టే ఉద్దేశం లేదని బీజేపీ ఇప్పటికే చెప్పింది. కానీ వైసీపీ సొంత ప్రచారం చేసుకుంటోంది. వీళ్లను కేబినెట్‌లోకి రావాలని బతిమాలుతున్నట్టు… ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారు. హోదా కావాలంటే కేబినెట్ నుంచి బయటకు రావాలని… అప్పట్లో టీడీపీని డిమాండ్ చేశారు కదా? హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి. నేను కూడా వైసీపీకి సహకరించేందుకు సిద్ధం’’ అన్నారు.
దేవాలయాలు నిర్మించే బీజేపీ… ఆలయాలు కూలగొట్టే వైఎస్సార్ కాంగ్రెస్ తో కలుస్తుందా అని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ నిజంగా ఆ రెండు పార్టీలు కలిస్తే రఘురామ కృష్ణం రాజు పరిస్థితి ఏంటి? అటు వైఎస్సార్ కాంగ్రెస్ కు కాకుండా ఇటు బీజేపీకి కాకుండా టీడీపీ వైపు చూస్తారా?
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…