Telugu

కాపులు హెరిటేజ్ పాలు పెరుగు మానేయండి … ముద్రగడ

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చంద్రబాబుతో తన వైరాన్ని బాగా పర్సనల్ గా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు అంటే ఒంటికాలి మీద లేచే ముద్రగడ తాజాగా కాపు జాతికి రాసిన బహిరంగ లేఖలో హెరిటేజ్ కి సంబంధించిన పాలు, పెరుగు, కోవా, పన్నీర్, నెయ్యి వాడటం మానేయాలని పిలుపునిచ్చారు.

శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు హెరిటేజ్ ఉత్పాదనలు వాడకూడదని పిలుపునిచ్చారు. తద్వారా చంద్రబాబు కుటుంబాన్ని ఆర్ధికంగా దెబ్బకొట్టొచ్చని అన్నారు. కాపులు వాటిని మానేయడమే కాకా ఇతరులను కూడా మానేయడానికి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అయితే కాపు రేజర్వేషన్ల గురించి రాష్ట్రప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది.

ADVERTISEMENT

ఇప్పుడు అది కేంద్రం పరిధిలోని అంశం. కేంద్రాన్ని ప్రశ్నించడం మానేసి ముద్రగడ చంద్రబాబునే టార్గెట్ చెయ్యడం రాజకీయం అనాలా మరొకటి అనాలా ఆయనే చెప్పాలి. ఉద్యమాన్ని వదిలేసి చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత వైరం పెంచుకుంటే అది కాపు జాతికి ఎలా మేలు చేస్తాదో… అన్నట్టు మార్చి 31 తరువాత ప్రకటిస్తా అన్న తదుపరి కార్యాచరణ ఏమైందో?

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Interval Bang Over Story? Are Films Being Written for Moments Instead of Meaning?

The “interval bang” has become a fixed rule in Telugu cinema. Every film seems designed…

17 minutes ago

Ranbir’s Next Brahmastra2 or Dhoom4: Are Both Bad Choices?

According to the latest news, Ranbir Kapoor has started hunting for his next project after…

37 minutes ago