Telugu

నాగేశ్వరరావుగా మారనున్న నాగచైతన్య?

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ లో వేసవి సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత బంగార్రాజులో ఒక చిన్న పాత్ర చెయ్యబోతున్నాడట. అది కాకుండా ‘గీతా గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్‌తో నెక్ట్స్ మీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తైయినట్టు సమాచారం. ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే పేరు పెట్టాలని దర్శకుడు అనుకుంటున్నాడట. ఏఎన్ఆర్ పేరు మీద సినిమా చేస్తున్నారంటే దాని మీద అంచనాలు భారీగా ఉంటాయి. అలాగే దానికి నాగార్జున పర్మిషన్ తప్పనిసరి.

ADVERTISEMENT

ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించే అవకాశాలున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కేబోయే ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టేనర్‌ అని చెబుతున్నారు. మరి ఈ సినిమాతోనైనా నాగ చైతన్యకు జోడిగా రష్మిక నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

సరిలేరు నీకెవ్వరూ తో స్టార్ లీగ్ లోకి వెళ్లిన ఆమె ఇప్పుడు నితిన్ తో భీష్మ చేస్తుంది. మరి ఈ సినిమాతో నాగ చైతన్య మరో సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. ఈ ఏడాది రెండో భాగంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

GG’s Hyderabad Star Experiment Backfires: Fans React

Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…

4 hours ago

If Sandeep Gives Up, Prabhas In Trouble?

Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…

4 hours ago