జనవరిలో చైతూ కూడా..!

జనవరిలో సంక్రాంతి కానుకగా పలు సినిమాలు వచ్చేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. అందులో ముఖ్యంగా బాలకృష్ణ ‘డిక్టేటర్‌’, ఎన్టీఆర్‌ ‘నాన్నకు ప్రేమతో’, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనో’ మనోజ్‌ ‘శౌర్య’ చిత్రంతో పాటు పలు చిత్రాలు జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పలు స్టార్‌ హీరోల సినిమాలు జనవరిలో రాబోతుండటంతో అందరి దృష్టి కూడా ఆ నెలపై ఉంది. తాజాగా అదే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో రాబోతున్నాడు.

ముందుగా అనుకున్న ప్రకారం ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అయ్యి, సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయబోతున్నారు. నాగార్జున సినిమా వచ్చిన రెండు వారాలకు చైతూ సినిమా వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏమాయ చేశావే కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని సినీ వర్గాల వారు సైతం అంటున్నారు.

Share
Published by

Recent Posts

Aniesh’s Itlu Arjuna Unveils Teaser Poster

Aniesh is making his acting debut with Itlu Arjuna, which is scheduled for a theatrical…

25 minutes ago

Pics: Raashii Radiates Sultry Charm In Black Gown

Raashii Khanna is sending temperatures soaring with her fiercely captivating new photoshoot, proving she is…

35 minutes ago