
నిన్న రాత్రి గాంధీ విషయంగా నాగబాబు ఇంకో ట్వీట్ వేశారు. “సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర ఆజాద్, పివి నరసింహారావు, అబ్దుల్ కలాం, వాజపేయి మరియు ఇతరుల చిత్రాలు మన దగ్గర కరెన్సీ మీద ఉండాలి. ఇతర నాయకులను మనం మరచిపోకూడదు” అని ఆయన ట్విట్టర్లో రాశారు.
“గాంధీ ఈ రోజు జీవించి ఉంటే, అతను కూడా దానిని ఆమోదించేవాడు. మన గొప్ప నాయకుల పేర్లను మాత్రమే గుర్తుంచుకునే రోజుల్లో మనం జీవిస్తున్నాము, ప్రభుత్వం వారి ఫోటోలు కరెన్సీ నోట్ల మీద ముద్రించి అలాంటి వారి ముఖాలను మన భావి తరాలకు పరిచయం చెయ్యాలి, ” అన్నారాయన.
కొందరు గాంధీ పై నాగబాబు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు అని అభిప్రాయపడగా…. కొందరు మాత్రం నాగబాబు ఏ ఉద్దేశంతో చెప్పినా ఆయన చెప్పిన దాంట్లో విషయం ఉందని అంటున్నారు. ఇంకొందరు మన దేశంలో అటువంటివి జరిగే అవకాశమే లేదని నిట్టూరుస్తున్నారు.
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan's office has strongly denied social media rumours claiming…
The Telugu film industry has had a strange trend for the last few years. Films…