
నిజజీవితంలో స్ఫూర్తినిచ్చిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా గరుడ వేగ, చందమామ కథలు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారు చెప్పిన ఒక కథను నాగార్జున ఒకే చేశారట. ఇది హిందీలో విజయవంతమైన రెయిడ్ అనే సినిమా రీమేక్.
అజయ్ దేవగన్, ఇలియానా నటించిన ఈ సినిమా కథకు కొన్ని మార్పులు చేసి, మరింత వేగంగా ఉండేలా తయారు చేసాడట ప్రవీణ్. గరుడవేగా సినిమా తరువాత ప్రవీణ్ గోపీచంద్ పుల్లెల జీవిత కథ ఆధారంగా సినిమా చెయ్యడానికి సిద్ధం అయ్యారు ప్రవీణ్ అయితే కొన్ని కారణల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
దానితో తన తరువాతి సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు ప్రవీణ్. ఈ సినిమా వైల్డ్ డాగ్ విడుదల తరువాత సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మిగతా హీరో హీరోయిన్లను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. మరోవైపు నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేశాడు. వేసవికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
This week's theme on the Bigg Boss Telugu reality show is GOAT. The house is…
సుప్రీంకోర్టు తీర్పు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని టీడీపీ నేతలు ఎంతగా బల్ల గుద్ది వాదించినా స్థానిక సంస్థల ఎన్నికలు…