
పైగా ఈ చిత్రంలో పాటలు కూడా ఉండవు కావున ప్రేక్షకులను ఆసాంతం సినిమాలో లీనం చెయ్యొచ్చు. ఈ చిత్రం కొన్ని నిజ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. హైదరాబాద్ లో జరిగిన గోకుల్ చాట్ బాంబు బ్లాస్ట్ తరువాత జరిగిన ఎన్కౌంటర్ గురించి ఎన్ఐఏ చేసినా ఒక సీక్రెట్ ఆపరేషన్. బాలీవుడ్ నటి డియా మీర్జా ఈ చిత్రానికి హీరోయిన్.
ఈ మూవీకి స్పెషల్ ఆప్స్ ఫేమ్ సైయామి ఖేర్, బిగ్ బాస్ 3 స్టార్ అలీ రెజా సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. ఊపిరి రచయిత అహిసర్ సోలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అతను గతంలో 2013 లో ఒక బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పాటలు లేని ఈ చిత్రానికి నేపథ్య స్కోర్ సంగీతాన్ని తమన్ సమకూర్చారు.
2016 ఊపిరి తర్వాత నాగార్జునకు హిట్ లేదు. దానితో ఆయన, ఆయన అభిమానులు ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రం ముందుగా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చెయ్యాలి అనుకున్నారు. అయితే చివరి నిముషంలో థియేటర్లు తెర్చుకోవడం, ప్రేక్షకులు ఆసక్తిగా రావడంతో ఆ ఆలోచన విరమించుకుని థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…