
“మేకర్స్ మూడు ఓటీతీ ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరిపారు, కాని వారందరికీ తక్కువ మొత్తంలో హక్కులు ఉండాలని చూశారు. కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. నాగార్జున ఇటీవలే ఫామ్ బాగా లేకపోవడం… కొత్త దర్శకుడు కావడంతో చిత్రంపై ఎక్కువ మొత్తం పెట్టడానికి వారు అనుకూలంగా లేరు” అని మనకున్న సమాచారం.
యథార్థ ఘటనల స్ఫూర్తితో రాసిన కథతో అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ఎన్.ఐ.ఏ. ఆఫీసరుగా నాగార్జున నటిస్తున్నారు. 26/11 ముంబై దాడుల నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. ఓ హాలీవుడ్ చిత్రంలాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
2016లో వచ్చిన ఊపిరి తరువాత నాగార్జున కు హిట్ అనేది లేదు. అతని చివరి చిత్రం మన్మదుడు 2 మరీ దయనీయమైన అపజయం. నటుడు అదృష్టంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రస్తుతం తాను చేస్తున్న వైల్డ్ డాగ్ మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి!
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…