“సోగ్గాడే చిన్నినాయనా”లో నాగ్ అసలు ‘ట్విస్ట్’ అదే!

అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తున్న “సోగ్గాడే చిన్నినాయనా” ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 2016 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాలో నాగార్జున రెండు విభిన్నమైన పాత్రల్లో కనువిందు చేయనున్న విషయం తెలిసిందే. తండ్రి కొడుకులుగా నటిస్తున్న నాగ్, తండ్రి పాత్రలో ఉన్న ‘ట్విస్ట్’ సినిమాను ఆసక్తికరంగా మార్చేసింది.

‘మన్మధుడు’ తరహాలో సాగే తండ్రి పాత్ర, సినిమా కధలో కేవలం రమ్యకృష్ణకు మాత్రమే కనపడుతుందట. నిజానికి ట్రైలర్ ను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం వీక్షకులకూ స్పష్టమవుతుంది. తండ్రి పాత్ర చెప్పిన డైలాగ్స్ కు ఒక్క రమ్యకృష్ణ మాత్రమే స్పందించిన విషయాన్ని కూడా గమనించవచ్చు. అలాగే ట్రైలర్ ఆద్యంతం తండ్రి పాత్ర ఒకే విధమైన కాస్ట్యూమ్స్ (తెల్లని దుస్తుల)లో కనపడుతుంది. దీంతో చనిపోయిన తర్వాత ‘ఆత్మ’ రూపంలో తండ్రి పాత్ర దర్శనమిస్తుందని సినీ వర్గాల టాక్.

ఈ విషయాన్నిప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న సందేహంతో గతంలో ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో స్వయంగా ‘కింగ్’ నాగార్జునే ఈ పాత్ర తీరుతెన్నులు గురించి కాస్త లీక్ చేసారు. ఇపుడు ట్రైలర్ రాకతో మరింత స్పష్టత వచ్చినట్లయింది. అయితే ఈ పాత్రే సినిమాలో పూర్తి ఎంటర్ టైన్మెంట్ పంచే విధంగా కనపడుతోంది.

Share
Published by

Recent Posts

Dada vs King 100: Why Is This Forced Clash Unavoidable?

The December release battle is getting interesting with Balakrishna’s NBK111 Dada and Nagarjuna’s King 100…

7 minutes ago

The Paradise: No Postponement, But Massive VFX Deadline

After days of uncertainty, Nani’s The Paradise is finally staying on course for its original…

26 minutes ago