
అయితే రాఘవేంద్రరావుతో తీయబోయే చిత్రమే ‘కింగ్’ కెరీర్ కు శుభం కార్డు పడబోయే సినిమా అవనుందని ట్రేడ్ వర్గాల టాక్. తన ఇద్దరు కొడుకుల సినీ భవిష్యత్తు రీత్యా నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని, స్తబ్దుగా ఉన్న చైతూ కెరీర్ కు ఊపుతేవడం, అలాగే టాలీవుడ్ లో అఖిల్ ను మరో సూపర్ స్టార్ ను చేయాలనే కృతనిశ్చయంతో నాగ్ తన సినీ కెరీర్ ను త్యాగం చేయడానికి సిద్ధమయ్యారని హల్చల్ చేస్తున్న ఈ వార్తలలో వాస్తవమెంత ఉందో తెలియాల్సి ఉంది.
అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఇది కేవలం ఒట్టి పుకారుగానే మిగిలిపోవాలని కోరుకుంటున్నారు. ‘మన్మధుడు’గా నాగార్జునకున్న ఇమేజ్ చెక్కు చెదరనిది. అలాంటి నాగ్ వెండితెరకు దూరం కావడం కంటే, బాలీవుడ్ లో అమితాబ్ మాదిరి వైరైటీ రోల్స్ చేయాలని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…
Nayanthara started 2026 on a strong note with Mana Shankara Vara Prasad Garu. The Chiranjeevi…