హిందూపురంలో “డిక్టేటర్” తొలి టికెట్ ధర 13.5 వేలు!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “డిక్టేటర్” సందడి మొదలైంది. మరికొద్ది గంటల్లో ధియేటర్లలో ప్రదర్శితం కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బాలకృష్ణ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో ఈ సినిమా తొలి మూడు టికెట్లను అభిమానులు వేలం పాట నిర్వహించారు.

విశేష సంఖ్యలో ఈ వేలం పాట నిర్వహణలో పాల్గొన్న బాలయ్య అభిమానులు మొదటి టికెట్ ను ఆలిండియా నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షుడు నంబూరి సతీష్ 13,500 రూపాయలకు కొనుగోలు చేయగా, రెండవ టికెట్ ను నందమూరి ఫ్యాన్స్ హిందూపురం టౌన్ అధ్యక్షుడు బండారు బాలాజీ 13,000 రూపాయలకు, మూడో టికెట్ కిరికెర సర్పంచ్ హెచ్.ఎన్.రాము 10,116లకు దక్కించుకున్నారు. ఈ టికెట్ల ద్వారా వచ్చిన డబ్బును నందమూరి బాలకృష్ణ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

ADVERTISEMENT

ఓవర్సీస్ లో ఈ సినిమా తొలి టికెట్ దాదాపు 3.60 లక్షలకు ఓ అభిమాని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీలోనూ వేలంపాట నిర్వహించడం విశేషం. “డిక్టేటర్” ఎఫెక్ట్ తో బహుశా సినిమా టికెట్లను వేలంపాట నిర్వహించే ట్రెండ్ మొదలవుతుందేమో..!

Share
Published by

Recent Posts

Jayam Ravi Drug Video: Real or AI? Internet in Shock

A leaked video of actor Jayam Ravi and his ex-girlfriend Keneeshaa smoking an illegal drug…

18 minutes ago

PVR Onion Pakodi at Rs. 250: Is This Daylight Robbery?

PVR Cinemas has added a very familiar Indian snack to its food menu, but the…

48 minutes ago