
ఆ వీడియో ప్రకారం ఈ మూవీలో హిలేరియస్ సీన్స్‌కు కొదవ ఉండదని అర్థమవుతుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని, 2021 లో సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. నాని తన టక్ జగదీష్ షూటింగ్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రకటనతో నాని తన శ్యామ్ సింఘా రాయ్‌ను మరింత ఆలస్యం చేయబోతున్నాడని ఊహాగానాలు వస్తున్నాయి.
అతను శ్యామ్ సింఘా రాయ్ కంటే ముందుగా ‘అంటే సుందరానికి’ చెయ్యనున్నారని సమాచారం. రాజా రాణి అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నజ్రియా ఫహద్ ఈ చిత్రంలో నానిని రొమాన్స్ చేయనున్నారు. ఈ చిత్రంతో ఆమె తన తెలుగు అరంగేట్రం చెయ్యనుంది.
వివేక్ ఆత్రేయ మునుపటి చిత్రాలకు ఇంప్రెసిప్ మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ ఈ చిత్రానికీ స్వరాలు కూరుస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి పనిచేసే మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Sai Dharam Tej’s wedding is back in the news, and this time, reports are even…
Mythri Movie Makers continues its focus on concept-oriented movies with its next outing, Donga Naa…