
Nani backs Paradise song choreography
నాని కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో, పీక్ హైప్ మధ్య వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’. సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు ఉన్నా, ‘ఆయా షేర్’ సాంగ్ ఆ హైప్‌కు మరింత సాలిడ్ ఫౌండేషన్ వేసింది.
అయితే ఆ తర్వాత వచ్చిన టీజర్ ప్రోమోకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అప్పటివరకు ఉన్న హైప్ కాస్త డైల్యూట్ అయిందనే కామెంట్స్ వినిపించాయి.
ఇప్పుడు #YeshaNagula సాంగ్ బయటకు వచ్చింది. సాంగ్ కంటే ముఖ్యంగా అందులోని కొరియోగ్రఫీపై సోషల్ మీడియాలో మిక్స్డ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. కొందరికి డ్యాన్స్ మూమెంట్స్ నచ్చితే, మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
ఈ టైమ్‌లోనే డ్యాన్స్ మాస్టర్ సందీప్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
“Caravanలోకి పిలిచి, ‘మాస్టర్, ఈ సాంగ్‌కి మీకు NATIONAL AWARD వస్తుంది’ అని నాని చెప్పారు. అన్ని సాంగ్స్‌లా కాకుండా ఇందులో చిన్న మ్యాజిక్ చేశాను” అని సందీప్ మాస్టర్ వెల్లడించారు.
నాని జడ్జ్‌మెంట్‌కు ఇండస్ట్రీలో మంచి క్రెడిబిలిటీ ఉంది. అలాంటి నాని ఏకంగా నేషనల్ అవార్డు వస్తుందని చెప్పారంటే, ఆ కొరియోగ్రఫీలో ఆయనకు ఏదో ప్రత్యేకంగా కనిపించే ఉండాలి.
ప్రస్తుతానికి సోషల్ మీడియా రెస్పాన్స్ ఒకలా ఉంది, నాని జడ్జ్మెంట్ మరోలా ఉంది. ఇద్దరిలో ఎవరు రైట్ అవుతారో తెలియాలంటే, ఫుల్ సాంగ్‌ను థియేటర్లో చూసే వరకు వెయిట్ చేయాల్సిందే!
After a long wait, Rajkummar Rao’s Prahaar has arrived on the big screen. The actor…
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…