
ఈ సినిమాలో నాని నెగటీవ్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఈ పోస్టర్ లో నాని గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తూ… చేతిలో కత్తెర, చేయి మీద నుండి కారుతున్న రక్తంతో అదిరింది. ఈ లుక్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించనున్నాడు. ఈ సంగీత దర్శకుడు ఇంతకుముందు సైరా సినిమాకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. నరేశ్, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్ , నందు, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్, హరితేజ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
2017లో విడుదలైన ఎంసీఏ సినిమా తరువాత నానికి సరైన హిట్ లేదు. ఆ తరువాత ఆయన నుండి నాలుగు సినిమాలు వచ్చాయి. అయితే ఆ నాలుగు సినిమాలు నిరాశపరిచాయి. దీనితో ఈ చిత్రం పై నాని భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో నాని తన తరువాతి చిత్రం ‘టక్ జగదీష్’ షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడు.
BOTTOM LINE Short on Scares RATING 2/5 Story, Screenplay, Director: Kirtan Nadagouda Cast: Chaithra J.…
Avneet Kaur steps into this gallery with a rich brown statement drape and a mood…