
“చర్చలు జరిగాయన్నది నిజం. కాని ఇది థియేటర్లలో చూడవలసిన చిత్రం అని మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఆ ప్రతిపాదనను విరమించుకున్నాము. ఒక దశలో సినిమా మొదటి సగం ఓటీటీ లో విడుదల చేయడాన్ని కూడా మేము పరిగణించాము. సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది… అది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విధంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది “అని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
2017లో విడుదలైన ఎంసీఏ సినిమా తరువాత నానికి సరైన హిట్ లేదు. ఆ తరువాత ఆయన నుండి నాలుగు సినిమాలు వచ్చాయి. అయితే ఆ నాలుగు సినిమాలు నిరాశపరిచాయి. దీనితో ఈ చిత్రం పై నాని భారీ ఆశలే పెట్టుకున్నారు. కెరీర్ లో పెద్ద బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న సుధీర్ బాబు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
నాని మొదటి సినిమా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నివేత థామస్ – అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందించారు. నాని క్యారెక్టర్ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉండబోతున్నాయని సమాచారం. యాక్షన్ పార్టు కూడానా ఎక్కువగా ఉంటుందంట.
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan's office has strongly denied social media rumours claiming…
The Telugu film industry has had a strange trend for the last few years. Films…