
కరోనా వైరస్ కారణంగా జనాలు థియేటర్ల వైపు వెళ్లడానికి భయపడుతున్నారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్. సినిమాలపై జనాలకు పెద్దగా ఆసక్తి ఉండదు. ఇక, ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. అది సినిమాపై మరింత ప్రభావం చూపుతుంది. అమెరికాలో కూడా పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు.
అక్కడ కరోనా వైరస్ టెన్షన్ ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో ప్రజలు బయటకు రావడం కూడా మానేశారు. ఈ సమయంలో సినిమా విడుదల అంటే భారీగా నష్టపోతాం అని అమెరికా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీద ఒత్తిడి చేస్తున్నాడట. సినిమా విడుదలకు రెండు వారాల టైం ఉండటంతో పరిస్థితి అప్పటికి ఏమైనా చక్కబడుతుందేమో అని దిల్ రాజు వెయిటింగ్ అట.
డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంతో నివేద థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇన్నాళ్లు చాలా సాఫ్ట్‌గా పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ నటనతో ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో మాత్రం నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నారు.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…