“నాన్నకు ప్రేమతో” ఆడియో రివ్యూ!

సుకుమార్ – జూనియర్ ఎన్టీఆర్ ల కాంభినేషన్ లో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన “నాన్నకు ప్రేమతో” ఆడియోపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మరి ఆ అంచనాలను “నాన్నకు ప్రేమతో” ఆల్బమ్ అందుకుందా? ఇటీవల కాలంలో కమర్షియల్ హిట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన దేవిశ్రీ ప్రసాద్, జూనియర్ కు కూడా ఆ స్థాయి మ్యూజిక్ అందించాడా? ఆల్బమ్ ఉన్న అయిదు పాటలను విశ్లేషిస్తే…

1) ఫాలో ఫాలో : జూనియర్ ఎన్టీఆర్ గాత్రం ప్రధాన హైలైట్ గా ఈ పాట నిలుస్తుందని మొదటిసారి వినగానే అర్ధమై పోతుంది. ‘ఆ… ఆ… అందమైన…’ పిల్లా అంటూ ప్రారంభమయ్యే పాటలో దేవిశ్రీ అందించిన లిరిక్స్, సంగీతం, ఎన్టీఆర్ స్వరం ఫస్ట్ టైంకే కనెక్ట్ అవుతాయి. ఒక రెగ్యులర్ గాయకుడు మాదిరి ఎన్టీఆర్ గానం ఉండడంతో బహుశా మున్ముందు మరిన్ని పాటలు ఎన్టీఆర్ నోటి వెంట వినవచ్చేమో! ‘నీ పర్మినెంట్ అడ్రెస్ నా గుండె జిల్లా… నీ లబ్ డబ్ గుండె కొట్టుకుంటే ఆ డబ్ డబ్ బీటు నేనే…’ వంటి దేవిశ్రీ పదాలు ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తుంది.

ADVERTISEMENT

2) డోంట్ స్టాప్ : చంద్రబోస్ అందించిన సాహిత్యంలో ఎంతో అర్ధముండే ఈ పాట హీరో క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేస్తుంది. ‘లక్ష్యం చేరుకునే వరకు ఆగిపోవద్దు’ అనే భావం వచ్చే విధంగా హీరో పాత్రను రచయిత చక్కగా వర్ణించారు. ‘శ్రీమంతుడు’ సినిమాలో ‘జాగో’ పాట తరహా సంగీతం, మైకేల్ జాక్సన్ మ్యూజిక్ వినపడుతున్నప్పటికీ, పాటలోని సాహిత్యం, రఘు దీక్షిత్ జోష్ ఫుల్ గానం వినసొంపుగా వుంటాయి.

3) నా మనసు నీలో : దేవిశ్రీప్రసాద్ రొటీన్ బీట్స్ ను తలపిస్తున్నప్పటికీ, భాస్కరభట్ల సాహిత్యం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో మధ్య మధ్యలో వచ్చే షర్మిల స్వరం ఆలరిస్తుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గానంతో పాటు అందించిన వెస్ట్రన్ బీట్స్ సంగీత ప్రియులను ఆకర్షిస్తాయి. ‘ముద్దులతో యుద్ధాలు, కౌగిలిలోన ఉంటే కారాగారం, కత్తులు దూసుకుంటున్నాయి ఇద్దరి కన్నులు…’ వంటి రొమాంటిక్ పదాలు అలరిస్తాయి.

4) లవ్ మీ ఎగైన్ : ఈ పాట ప్రారంభం కాగానే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ సినిమాలోని ‘ముంతాజ్ మహల్ కట్టించాడే షాజహాన్’ అనే బీట్ మరియు ‘1 నేనొక్కడినే’ సినిమాలోని ‘సయోనరా…’ పాట గుర్తుకు వస్తుంది. అయితే, చంద్రబోస్ సాహిత్యం, సూరజ్ సంతోష్ స్వరం పాటలోని ఆర్ద్రతను శ్రోతలకు తెలియజేసేలా ఉంటుంది. “నిదరోని తూరూపు కోసం సూర్యుడే మళ్ళీ రాడా… జత లేని తారల కోసం జాబిల్లి మళ్ళీ రాదా… అడుగేయని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా…” అనే లిరిక్స్ సాహిత్య ప్రియులను ఆకర్షిస్తాయి.

5) లవ్ దెబ్బ : ఈ ఆల్బమ్ లో చంద్రబోస్ సాహిత్యం అందించిన మూడవ పాట. జూనియర్ ఎన్టీఆర్ మాస్ అభిమానుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాటగా స్పష్టమవుతోంది. దేవిశ్రీ జోష్ ఫుల్ మ్యూజిక్ కు తోడు దీపక్, శ్రావణ భార్గవిల హుషారైన గాత్రం మాస్ ప్రియులను అలరిస్తుంది.

దేవిశ్రీ ప్రసాద్ అందించిన అయిదు పాటలలో జూనియర్ ఎన్టీఆర్ పాడిన ‘ఫాలో ఫాలో’ పాట ‘ఆల్బమ్’కు హైలైట్ సాంగ్ గా నిలువనుంది. ఇక, మిగిలిన పాటల్లో అక్కడక్కడ దేవి గత సినిమాల సంగీతాన్ని గుర్తు చేస్తున్నప్పటికీ…. మొత్తంగా చెప్పాలంటే… “నాన్నకు ప్రేమతో” పాటలు వినడానికి పర్వాలేదనిపించేగా, చూడడానికి అందంగా కనిపించేలా ఉన్నాయి. ఈ పాటలకు వెండితెరపై ఎన్టీఆర్ జోష్ ఫుల్ స్టెప్స్ తోడైతే అభిమానులకు పండగే పండగ!

Share
Published by

Recent Posts

Jagan In INDIA: Not Happening Really?

Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…

21 minutes ago

What To Watch on OTT This Week?

The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…

51 minutes ago