“నాన్నకు ప్రేమతో” కలెక్షన్స్ కుమ్మాయి!

ఓవర్సీస్ ప్రేక్షకుల ఆదరణతో “నాన్నకు ప్రేమతో” కలెక్షన్స్ తొలి 5 రోజులకు గానూ దాదాపు 40 కోట్ల మార్క్ ను టచ్ చేసినట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 25 కోట్లు వసూలు కాగా, కర్ణాటకలో 5 కోట్లు, ఓవర్సీస్ లో 7 కోట్లు కొల్లగొట్టింది. రెస్టాఫ్ ఇండియా, రెస్టాఫ్ వరల్డ్ కలెక్షన్స్ తో కలిపి దాదాపుగా 40 కోట్ల మార్క్ ను అందుకుందని ట్రేడ్ వర్గాల టాక్.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కున్న మార్కెట్ కు ఏపీ, తెలంగాణాలలో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు. సినిమా మాస్ వర్గాలను చేరువ కాకపోవడంతో ఎన్టీఆర్ కున్న స్థానిక మార్కెట్ “నాన్నకు ప్రేమతో”కు దోహదం కాలేకపోయిందని సినీ పండితుల విశ్లేషణ. అయితే ఇదే సమయంలో ఓవర్సీస్, కర్ణాటక వంటి ప్రాంతాలలో ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కు కొత్త మార్కెట్ ఏర్పడినట్లుగా విశ్లేషిస్తున్నారు.

ADVERTISEMENT

పండుగ సెలవులు కావడంతో ఇప్పటివరకు పర్వాలేదనిపించే కలెక్షన్స్ ను అందిపుచ్చుకున్న “నాన్నకు ప్రేమతో”కు అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభమైంది. మరి జూనియర్ ఎంతవరకు తన సత్తా చాటుతాడో చూడాలి. ఇప్పటివరకు ఊరిస్తున్న 50 కోట్ల క్లబ్ లోకి అడుగు పెడతాడా? అని ‘బుడ్డోడు’ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share
Published by

Recent Posts

Pawan Kalyan’s Heroine’s Unreal Downfall: No Comeback?

Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…

27 minutes ago

Mahendragiri Varahi Is Today’s Cinema and a Hit – Akhil

Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…

50 minutes ago