
ఒక్క రాజమౌళి మాట మాత్రమే కాదు, డైరెక్షన్ డిపార్టుమెంటు గురించి అవగాహన వున్న ప్రతి ఒక్కరిది ఇదే రకమైన అభిప్రాయం. ఇక, తాజాగా సుకుమార్ దర్శకత్వం వహించిన “నాన్నకు ప్రేమతో” ఆడియో నేడు అంగరంగ వైభవంగా విడుదల కానుంది. దీనిని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సినిమా పోస్టర్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎన్టీఆర్ డ్యాన్సింగ్ చేస్తూ దర్శనమిస్తున్న ఈ పోస్టర్స్ ను ‘బుడ్డోడు’ అభిమానులు షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఒక్క ఎన్టీఆర్ అభిమానులనే కాదు, సినీ ప్రియులను కూడా ఈ “నాన్నకు ప్రేమతో” పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
దీంతో “నాన్నకు ప్రేమతో” ఆడియో అనేది సోషల్, వెబ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ పోస్టర్స్ ఇంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం… సుకుమార్ ‘టేకింగ్.’ ఓ సాధారణ డ్యాన్సింగ్ స్టిల్ ను కూడా సుకుమార్ యాంగిల్ లో చూస్తే అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం జరుగుతోంది కూడా అదే! ఇటీవల జీప్ పై కూర్చుని వున్న జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ కు కూడా అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా “నాన్నకు ప్రేమతో” సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాలి. అప్ డేట్స్ కోసం వీక్షిస్తూనే ఉండండి మీ అభిమాన ‘మిర్చి9.కాం’ను…!
Andhra Pradesh politics has largely become a two-sided contest after the formation of the NDA…
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…