Telugu

వైసీపీ నేతలే చెప్పుకొంటున్నారుగా.. అభివృద్ధి జరగడంలేదని!

ప్రస్తుతం కర్నూలులో యువగళం పాదయాత్ర చేస్తున్న టిడిపి యువనేత నారా లోకేష్‌ ధోన్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ధోన్ నియోజకవర్గం ప్రజలైన మీరందరూ వరుసగా రెండుసార్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని గెలిపిస్తే ఆయన మీ జిల్లాకు, నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేశారు? రాష్ట్రానికి ఆర్ధికమంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీ జిల్లాకు, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటి అనేక మౌలికవసతులు కల్పించవచ్చు. జిల్లా నుంచి ఆర్ధికమంత్రి మంత్రివర్గంలో ఉన్నారంటే అనేక అభివృద్ధి పనులు చేసి ఉండవచ్చు.

ADVERTISEMENT

కానీ నేను పాదయాత్ర చేస్తుంటే దారిలో మహిళలు కనీసం త్రాగునీరు కూడా లభించక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఆర్ధికమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లాలో, నియోజకవర్గంలో ఇటువంటి దుస్థితి ఉందంటే మరి మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో అందరికీ ఇసుక, గంజాయి, భూకబ్జాలు చేయడం తప్ప నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ఎటువంటి ఆసక్తి లేదని నేను గ్రహించాను. కనుక టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ పరిస్థితులు మారుతాయి,” అని అన్నారు.

రాష్ట్రంలో అనేకమంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధికి ఏమీ చేయలేకపోతున్నారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే చెప్పారు. ఆనం రామనారాయణ రెడ్డి ఇదే చెప్పారు. ఉండవల్లి శ్రీదేవి ఇదే చెప్పారు. చివరికి శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి చేయలేకపోతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా విశాఖ రాజధాని అయితేనే శ్రీకాకుళం అభివృద్ధి అవుతుందని చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా ఒప్పుకొంటున్నారు. వారిని ప్రజలు కూడా గట్టిగానే నిలదీస్తున్నారు.

అసలు సంక్షేమ పధకాలనే అభివృద్ధి అని భ్రమిస్తూ, ప్రజలను కూడా భ్రమింపజేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, రాష్ట్రంలో వేరేగా అభివృద్ధి పనులు ఎందుకు జరుగుతాయి? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది?కనుక నారా లోకేష్‌ మాటలు వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కేవలం రాజకీయ విమర్శలగానే అనిపించవచ్చు. కానీ లోకేష్ అడుగుతున్న ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పక ఆలోచింపజేస్తాయని భావించవచ్చు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Protests Put Brakes on Modi Government’s Big Plans

The Narendra Modi government is facing fresh challenges in pushing forward its major reforms. Plans…

3 minutes ago

Bigg Boss Telugu: Thrigun’s Toxic Manipulative Game

Bigg Boss Telugu Season 10 gameplay has reached an entirely new level. Everything was good…

33 minutes ago