
సీరియస్ మాడ్యులేషన్ తో డైలాగ్స్ చెప్పే నారా రోహిత్ కు ప్రత్యర్ధిగా ఈ సారి నందమూరి హీరో తారక్ వాయిస్ కూడా అలాగే వినిపిస్తోంది. ఇప్పటికే పలు సినిమాలలో తన విలనిజాన్ని ప్రదర్శించిన తారక్ కు ఈ సినిమా యువ విలనిజాన్ని తీసుకొచ్చేలా కనపడుతోంది. అలాగే రోహిత్ నుండి ‘రౌడీ ఫెలో, అసుర’ వంటి సినిమాలలో వినిపించిన డైలాగ్స్ మాదిరి తాజా సినిమాలోనూ వినపడుతుండడంతో నారా రోహిత్ అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిత్ర కధ ప్రధానంగా వీరిద్దరి మధ్య జరిగే యుద్ధంగా కనపడుతుండగా, సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఈ ట్రైలర్ కు ప్రధాన హైలైట్ గా నిలిచింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా వారాహి బ్యానర్ నుండి వస్తుండడంతో ప్రేక్షకుల్లో పాజిటివ్ సంకేతాలు వెలువడుతున్నాయి. నారా రోహిత్ సరసన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేం ఇషా తల్వార్ నటించింది.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…