
పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్ కు జంటగా నందిత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మొదటి టీజర్ ను విడుదల చేసారు. ఇటీవల కాలంలో సీరియస్ పాత్రలు చేసి బహుశా బోరు కొట్టిందేమో గానీ, “సోలో” సినిమా తరహాలో ఓ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ పాత్రలో నారా రోహిత్ దర్శనమిచ్చారు. అయితే అది అతని శరీరాకృతికి సూట్ కాకపోవడం విశేషం.
బరువు తగ్గించుకుని, బాడీ తగ్గిస్తానని గత మూడు సినిమాలుగా చెప్తూ వస్తున్నా రోహిత్ శరీరాకృతిలో ఏ మాత్రం మార్పు లేకపోగా, మరింత ఒళ్ళు చేయడం విశేషం. గత సినిమాలు యాక్షన్ కధాంశంతో కూడుకున్నవి కావడంతో, రోహిత్ ఆ రేంజ్ లో ఉన్నా ప్రజలు ఆదరించారు. కానీ, “సావిత్రి” సినిమాలో పోషించిన రొమాంటిక్ పాత్రకు ఈ బాడీ వీక్షించడానికి కాస్త విడ్డూరంగానే ఉంటోందని విమర్శకులు చెప్తున్న మాట. టీజర్ గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ లేకపోయినా, గత చిత్రాలను పరిశీలిస్తే… నారా రోహిత్ మరో జోనర్ లో ఈ “సావిత్రి”ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.
BOTTOM LINE A Tender Tale of Two Kids RATING 2.5/5 Story, Screenplay,Director: Srikar Nayan G…
Ranbir Kapoor's Ramayana has received a good response, especially for its visuals. Director Nitesh Tiwari…