
అయితే అమిత్ షా ప్రదర్శించిన సర్టిఫికేట్లు ఫేక్ అని, అసలు ఆ సంవత్సరంలో డిగ్రీ సర్టిఫికెట్లు అలా విడుదల చేయలేదని ఆప్ పార్టీ మోడీ సర్టిఫికేట్లను, ఆ సంవత్సరపు సర్టిఫికేట్లను పక్కన పెడుతూ సమాధానం ఇచ్చింది. అంతేగాక, బిఏ, ఎంఏలలో ఉన్న సర్టిఫికేట్లలో పేర్లు తేడా ఉన్నాయని, ఒకవేళ ఆ పేర్లు తేడా ఉంటే ఖచ్చితంగా ఒక అఫిడవిట్ ఉండాలని, అది ఎక్కడ ఉంది..? ఈ పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా ఇవి ఫేక్ సర్టిఫికేట్లనీ అర్ధమవుతోందని సాక్ష్యాలు బయట పెట్టారు ఆప్ పార్టీ.
జరుగుతున్న ఈ పరిణామాలతో నిజంగానే మోడీ సర్టిఫికేట్లు ఫేక్ వేనా? అన్న ప్రశ్నలు ప్రజల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బిజెపి తమ వాదనను వినిపిస్తుంటే, ఆప్ కూడా అదే స్థాయిలో జవాబు ఇస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధంలో ఎలాంటి సంచలన నిజాలు బయటకు వస్తాయో చూడాలి.
For the first time in a long time, there is genuine curiosity about whether Prabhas…
Goodachari 2 is one of those Telugu films that has built strong expectations without relying…