Telugu

ఒక్క బుడ్డోడు… సిల్వర్ స్క్రీన్ ను అల్లాల్లాడిస్తున్నాడు..!

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లలో టాప్ హీరోల సినిమాలు రిలీజైతే ఇతర సినిమాల వసూళ్లకు గండి పడాల్సిందే. అలాంటిది తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజైన ఓ హాలీవుడ్ సినిమా భారత్ లో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లో 74.08 కోట్ల రూపాయలను వసూలు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఈ సినిమాలో స్టార్ హీరోలు కానీ హీరోయిన్లు కానీ లేరు. భారత సంతతికి చెందిన నీల్ సేథీ తప్ప మరో నటుడు ఈ సినిమాలో కనిపించడు. ప్రముఖ కామిక్ స్టోరీ ‘మోగ్లీ’ స్పూర్తితో రూపొందిన ‘ది జంగిల్ బుక్’ కథ భారత్ లో వివిధ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందర్నీ అలరిస్తోంది. ఓ నల్ల పిల్లికి దొరికిన పిల్లాడ్ని అడవిని దాటించాలని భావించడం ఈ సినిమా కథ. ఈ సినిమాలో పెద్ద పులి, నక్కలు, కొండచిలువ, ఎలుగుబంటి, ఏనుగులు, కోతులు ఇలా కనిపించే ప్రతి పాత్ర ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. దీంతో ప్రేక్షకులు కూడా 100 కోట్లతో ఆశీర్వదించక తప్పని పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Venkatesh and Kalyan Ram Shift from Action to Dance

Kazakhstan is serving as the backdrop for the latest schedule of January 12 Vidudala. Victory…

7 minutes ago

ఇవి ఎన్నికలే కానప్పుడు పోటీ, అల్లర్లు దేనికి?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఇవి ఎలక్షన్లో, సెలక్షన్లో తెలియడం లేదు.…

17 minutes ago