
1945, ఆగస్టు 22న తైపీలో నేతాజీ మృతదేహానికి అంతిమ సంస్కారం జరిగిందని, అంతకుముందు ఆయన పేరును ఇచిరో ఒకురాగా పేర్కొంటూ డెత్ సర్టిఫికెట్ జారీ అయిందని, అప్పటి తైపీ అధికారి టాన్ టిటి చెప్పినట్టున్న కొన్ని పత్రాలు ‘బోస్ ఫైల్స్’ వెబ్ సైట్ పేర్కొంది. ఆగస్టు 18న విమాన ప్రమాదం జరిగిందని, భారత నాయకుడు బోస్ ఓ ముఖ్యమైన పని మీద టోక్యో వెళుతూ, తీవ్రంగా గాయపడి మరణించారని టాన్ వాగ్మూలం ఇచ్చారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కుటుంబ సభ్యులు దగ్గర లేనప్పుడు సైనిక ఆసుపత్రిలో ఇచ్చే మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా దహన సంస్కారాలకు అనుమతి ఇచ్చామని ఆప్పటి తైవాన్ సర్కారు తన రిపోర్టులో వెల్లడించింది. అంత్యక్రియల మరుసటి రోజే జపాన్ సైన్యాధికారి, బోస్ మృతదేహంతో వచ్చిన ఇండియన్ (కల్నల్ హబీబుర్ రెహ్మాన్ గా భావన) ఆయన అస్థికలు తీసుకువెళ్లారని టాన్ తెలిపారు. కాగా, ఈ పత్రాలను తాము అసలైనవనే నమ్ముతున్నట్టు నేతాజీ కుమార్తె అనితా ఫాప్ తెలిపారు. ఈ నెల 23న బోస్ కు సంబంధించి ఇండియా వద్ద ఉన్న మరికొన్ని రహస్య పత్రాలను ప్రధాని స్వయంగా బహిర్గతం చేయనున్నారు.
Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…