
మిస్టర్ మజ్ను ఇప్పుడు థియేటర్లలో ఉంది. అయితే చాలా చోట్ల మూడవ వారంలో ఉన్న ఎఫ్2 కంటే ఈ సినిమా కలెక్షన్స్ తక్కువ గా ఉండటం గమనార్హం. దీనితో అదృష్టం వరించి మొదటి రెండు సినిమాలు స్టార్ల సరసన చేసినా ఆ ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఆమెను పూరి జగన్నాధ్ రామ్ సినిమా ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మడి ఆశలన్నీ ఈ సినిమా మీదే. నిధీ అగర్వాల్ తో పాటు సభా నతేష్ ఇంకో హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే పూరి కూడా ఇప్పుడు చాలా బ్యాడ్ టైమ్ లో ఉన్నారు. ఈ టైంలో పూరీని నమ్ముకోవడం అంటే సాహసమే.
రామ్ కెరీర్ కూడా ఏమంత సాఫీగా సాగడం లేదు. ఆయన చివరి సినిమా హలో గురు ప్రేమ కోసమే యావరేజ్ గా నిలిచింది. దీనితో ఆయన కూడా ఇస్మార్ట్ శంకర్ మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా రెగులర్ షూటింగ్ ఈ మధ్యనే మొదలయ్యింది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఫార్మ్ లో లేరు. ఆయనకు కూడా ఈ చిత్రం ఒక రకంగా డో ఆర్ డై లాంటిదే. గతంలో పూరి మణి శర్మ కాంబినేషన్ లో ఎన్నో మ్యూజికల్ హిట్లు వచ్చాయి. ఈ సారి ఏం చెయ్యబోతున్నారో చూడాలి.
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…
Since the official announcement of Allu Arjun and Lokesh Kanagaraj's tentatively titled AA23, fans have…