
ఈ సినిమాలో మహేష్ బాబు సైనికుడిగా కనిపించినా యుద్దానికి సంబంధించిన సన్నివేశాలు పెద్దగా ఉండవు. లీవ్ లో ఉన్న సైనికుడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారట. పైగా మహేష్ బాబు ప్రస్తుతానికి హాలిడే కి వెళ్ళారు. వచ్చిన వెంటనే షూటింగ్ మొదలు పెడతారు. సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కాబట్టి ఎక్కడా బ్రేక్ లేకుండా షూట్ చెయ్యాల్సి ఉంది. కాబట్టి మేక్ ఓవర్ కు పెద్దగా సమయం కూడా లేదు. అయితే అభిమానులకు ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది.
ఈ మధ్య మహేష్ సినిమాలు గమనిస్తే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో వస్తున్నాయి. మాస్ అంశాలకు దూరంగా మహేష్ కథల ఎంపిక ఉందని చెప్పొచ్చు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలా సోషల్ మెసేజ్ తో మహేష్ సినిమాలు వచ్చాయి. కాని “సరిలేరు నీకెవ్వరు” మెసేజులు ఇచ్చే సినిమా కాదని తెలుస్తుంది. పక్కా కమర్షియల్ అంశాలు మేళవించిన సినిమాగా….మంచి యాక్షన్ సినిమాగా ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకేక్కిన్చాబోతున్నారని తెలుస్తుంది.
Rajinikanth is currently enjoying the box-office response to his Jailer 2 across the world. Meanwhile,…
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…