Telugu

నమ్ముకున్న వారందరినీ జగన్ ముంచేసి డబ్బున వారి వెనుక పడుతున్నారా?

ఎన్నికల ముంగిట వైఎస్సాఆర్ కాంగ్రెస్ తప్పటడుగులు వేస్తుందా? నమ్మకస్తులను పక్కన పెట్టి డబ్బు సంచులు తెచ్చే వారికే టిక్కెట్లు ఇస్తున్నారా? ఈ అభియోగాలు చేస్తుంది ప్రత్యర్ధులు కాదు. ఆ పార్టీ వర్గాలే. నిన్న కాక మొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. వైఎస్ కాలం నుండి వీరవిధేయులు గౌరు కుటుంబం. జగన్ పార్టీ పెట్టిన నాటి నుండీ జగన్ వెంట నడిచారు. ఇప్పుడు వారికి టిక్కెట్టు లేదని చెప్పేశారు జగన్.

ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా అదే చేసినట్టు తెలుస్తుంది. గత ఎన్నికలలో కేవలం 12 ఓట్ల తో గెలిచిన ఆళ్ల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కోర్టులలో అనేక కేసులు వేశారు. తన నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ జరగనివ్వకుండా అడ్డుకున్నారు. పంతానికి వెళ్లి సదవర్తి భూములను అధికధరలకు కొన్నారు. రాజన్న కాంటీన్లు అంటూ 5 రూపాయిల భోజన పథకం మొదలు పెట్టి భారీగానే చేతి చమురు వదిలించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన టిక్కెట్టు కష్టమని చెప్పేశారట.

ADVERTISEMENT

దీనితో ఆళ్ల విపరీతమైన ఒత్తిడిలో పడిపోయారట. శుక్రవారం నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కార్యకర్తలకు కూడా అందుబాటులోకి రావడంలేదు. మరోవైపు స్థానిక వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయనకు మద్దతుగా తాడేపల్లి మండల వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు.. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యరనే వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఎంపీలు – వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు కూడా టిక్కెట్లు కష్టమని చెప్పేశారట.

వైవీ ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు రావడం మానేశారు. ఇటువంటి పరిస్థితిలు చాలా జిల్లాలలో కనిపిస్తున్నాయి. ఇలా నమ్ముకున్న వారందరినీ జగన్ ముంచేసి డబ్బున వారి వెనుక పడుతున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. గత ఎన్నికలలో కూడా చివరి నిమిషంలోనే ఓడిపోయామని ఇప్పుడు కూడా చివరిలో తప్పులు చేస్తున్నామని వారు వాపోతున్నారు. పాదయాత్ర కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టించి ఇప్పుడు వారిని పక్కన పెట్టడంతో నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ICE Arrests Andhra Student as Convicted Child Predator

An Indian national on a student visa has been detained in the United States over…

25 minutes ago

సమ్మర్ సీజన్ ని రీ రిలీజులకి వదిలేశారుగా..

ఈమధ్యకాలంలో మన దర్శకులు, కథానాయకులు సంక్రాంతి సీజన్ మీద మరీ ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేసి మిగతా హాలిడే సీజన్…

35 minutes ago