
ఈ సినిమాను అమితంగా ఇష్టపడే వారి జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారన్న విషయం తాజాగా బహిర్గతమైంది. “నాన్నకు ప్రేమతో” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో… “నాన్నకు ప్రేమతో” సినిమా స్క్రీన్ ప్లేలో ఎలాంటి గందరగోళం లేకుండా జాగ్రత్త వహించడం అనేది ‘1’ సినిమా ఫలితం ప్రభావమేనా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన జూనియర్ ఎన్టీఆర్… “1 నేనొక్కడినే” అనే సినిమా ఫ్యాబులస్, ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం… అంటూ బదులిచ్చారు. ఒక్కో సినిమాకు దర్శకుడు ఒక్కో స్క్రీన్ ప్లే రాసుకుంటారని, ఆ సినిమాకు అది రాస్తే, “నాన్నకు ప్రేమతో” సినిమాకు ఈ స్క్రీన్ ప్లే సుకుమార్ రాసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు.
ఇక, సుకుమార్ పై జూనియర్ కురిపించిన ప్రశంసలకు కొదవే లేదు. “తనతో ఒక సినిమా కాదు, మరో రెండు, మూడు సినిమాలు చేయాలని ఆశగా ఉందని, “నాన్నకు ప్రేమతో” సినిమా ద్వారా నాతో పాటు అందరికీ గొప్పగా నటించే అవకాశాన్ని సుకుమార్ కల్పించారని, ఆయన్ని ఒక్క ‘పదం’లో వర్ణించడం తనకు సాధ్యం కాదని, ప్రపంచ దర్శకుడిగా సుకుమార్ వెలుగొందాలని, ఆ సమయం కోసం నిజంగా ఎదురు చూస్తున్నానని” దర్శకుడు సుకుమార్ ప్రతిభను జూనియర్ ఎన్టీఆర్ కొనియాడిన విధానం వీక్షకులను ఆకట్టుకుంది.
A leaked video of actor Jayam Ravi and his ex-girlfriend Keneeshaa smoking an illegal drug…
PVR Cinemas has added a very familiar Indian snack to its food menu, but the…