Telugu

జూనియర్ ఎన్టీఆర్ ను సన్మానించిన అభిమానులు!

‘జనతా గ్యారేజ్’ సెట్స్ లో జూనియర్ అభిమానులు ప్రతి రోజు సందడి చేస్తున్న వైనం తెలిసిందే. ఇలా సినిమా మొదలైన తొలిరోజు నుండి ఏదొక ఫోటో సోషల్ మీడియాలో సందడి చేయడం షరామామూలు అయిపోయింది. తాజాగా ‘జనతా గ్యారేజ్’ సెట్స్ లో ఏకంగా తమ అభిమాన హీరోను సన్మానించేసారు అభిమానులు. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అభిమానులను అక్కున చేర్చుకుంటూ జూనియర్ కూడా వారి చేత శాలువ కప్పించుకోవడం విశేషం. గడ్డం లుక్ లో అదిరిపోయే హెయిర్ స్టైల్ తో దర్శనమిస్తున్న జూనియర్ ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ కు హీరోలను దగ్గర చేసే పనిని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ చేపట్టినట్లుగా కనపడుతోంది. లేదంటే… ప్రతి రోజు ఇలా నెట్టింట్లో ఫోటోలు సందడి చేయడానికి ఆస్కారం ఉండదు.

ADVERTISEMENT

ఏది ఏమైనా తమ అభిమాన హీరోను కలుసుకోవడానికి మించి ఫ్యాన్స్ కు ఇతర పండగ ఏముంటుంది? అందుకే జూనియర్ తో ఫోటోలు దిగడం… వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం… బుడ్డోడు అభిమానులకు దినసరి కార్యక్రమాలలో ఒకటిగా అయిపోయింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆ అంచనాలను మరింతగా రెట్టింపు చేసిన విషయం తెలిసిందే.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

3 hours ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

3 hours ago