“నాన్నకు ప్రేమతో” ఆడియోపై ‘ఇండస్ట్రీ’ టాక్!

ntr nannaku prematho audioసుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందుతున్న చిత్రం “నాన్నకు ప్రేమతో…” దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ సినిమా ఆడియో ఈ నెల 27వ తేదీన విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. సుకుమార్ – దేవి కాంభినేషన్ కావడంతో ఈ సినిమా ఆడియోపై ఎప్పటి మాదిరే భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కలయికలో చివరగా వచ్చిన చిత్రం “1 నేనొక్కడినే” కూడా కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేనప్పటికీ, మ్యూజికల్ హిట్ అందుకుంది. ‘ఆవ్ తుజో మోకర్తా…’ అంటూ దేవి తెలుగు భాష రాని వారిని కూడా ఒక ఊపు ఊపాడు. దీంతో “నాన్నకు ప్రేమతో…” ఆడియో కోసం ఒక్క ‘బుడ్డోడు’ అభిమానులే కాదు, సంగీత ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ట్రేడ్ వర్గాలలో లభిస్తున్న సమచారం ప్రకారం… మరోసారి సంగీత ప్రియులు పండగలో మునిగితేలే విధంగా ఆడియో రూపొందిందని టాక్. దేవిశ్రీ మరోసారి తన సత్తాను చూపించాడని, జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక బెస్ట్ ఆల్బమ్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల ఇంటర్నెట్ లో లీక్ అయిన ఓ పాట ఈ సమాచారాన్ని మరింత బలపరుస్తోంది. దేవిశ్రీ ఆలపించిన ఈ పాట వెబ్ వరల్డ్ లో ‘సూపర్’ టాక్ ను సొంతం చేసుకుంది. దాదాపు నిముషం పాటు లీక్ అయిన ఈ పాటలో దేవిశ్రీ మార్క్ సంగీతం అదిరిపోయింది. ఎన్టీఆర్ అభిమానులు డౌన్ లోడ్ లు చేసుకోవడం, రింగ్ టోన్లుగా మార్చుకోవడం శరవేగంగా జరిగిపోతోంది.

దీంతో అందరి చూపులు ఈ ఆడియో వేడుక వైపుకు మళ్ళుతున్నాయి. తొలుత 25వ తేదీనే విడుదల చేయాలని భావించినప్పటికీ, దేవిశ్రీ ఇంట నెలకున్న ‘విషాదం’ రీత్యా 27వ తేదీకి మార్చారు. అయితే దీనికి సంబంధించి కూడా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరో విశేషమేమిటంటే సుకుమార్ మార్క్ ‘ఐటెం’ సాంగ్ లేకుండా “నాన్నకు ప్రేమతో…’ ఆడియో రూపొందింది. విడుదలకు ముందు ఇంతగా సందడి చేస్తున్న “నాన్నకు ప్రేమతో…” విడుదల తర్వాత ఇంకెంత హంగామా సృష్టిస్తుందో చూడాలి..! ఆవురావురుమంటూ ఎదురు చూడడం ‘బుడ్డోడు’ అభిమానుల వంతవుతోంది!

Share
Published by

Recent Posts

Green Card Overhaul: Major PERM Change Clears White House

The White House has cleared a proposed overhaul to the PERM employment-based green card program.…

16 minutes ago

Full Of Vacuum But Venky-Trivi Must Fire Up!

For a film marking the collaboration of Venkatesh and Trivikram Srinivas, Adarsha Kutumbam is perhaps…

32 minutes ago