అయ్యో… మెగాస్టార్ ను ఈ పొజిషన్ లో చూడలేరేమో!

ఏ హీరో ఫ్యాన్స్ అయినా వారి అభిమాన నటుడ్ని ఆకాశంలో చూస్తారు. అయితే అసలు ఆకాశమంత ఎత్తులో ఉన్న హీరోను మరి ఆ అభిమానులు ఎలా చూడాలి? ప్రస్తుతం ఇదే ప్రశ్న మెగాస్టార్ ఫ్యాన్స్ ను వేధిస్తోంది. చేతికి కట్టు కట్టుకుని పెళ్లి సందడిలో దర్శనమిస్తున్న మెగాస్టార్ ను చూసి రెండు రకాలుగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఒకటి, చిరుకు అయిన ఆపరేషన్ ను తలచుకుని కాగా, మరొకటి చిరు చేస్తున్న పనిని తలచుకుని! మెగాస్టార్ ఇంట పెళ్లి బాజాలు మ్రోగనున్న విషయం తెలిసిందే. శ్రీజ రెండవ వివాహానికి సర్వం సన్నద్ధం కావడంతో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. అయితే అసలు పెళ్లి పనులు ప్రారంభం కావాలంటే, హిందూ సాంప్రదాయం ప్రకారం తొలుత రోటిలో పసుపు కొమ్ములు దంచి లాంఛనంగా ప్రారంభిస్తారు.

ADVERTISEMENT

బహుశా మెగాస్టార్ ఉన్న స్టిల్ కూడా ఇదే అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే… పసుపు కొమ్ములు దంచేది కేవలం మహిళలు మాత్రమే. ఒక్క ఆ విషయంలోనే కాదు, వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఏ విషయంలోనూ మగవారు ఇలా రోకలును పట్టుకోరు. మరి మెగాస్టార్ ఎందుకు పట్టుకున్నారో గానీ, ఈ ఫోటోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పడుతున్నాయి. అయితే ఇదే సందర్భంలో స్లిమ్ అయిన మెగాస్టార్ స్వరూపాన్ని చూసి అభిమానులు పొంగిపోతున్నారు.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

4 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

8 hours ago