తుని ఘటన – ఒక్క “నేరగాడు” చేసిన పనే!

ప్రశాంత జిల్లాలుగా పేరు బడిన ఉభయ గోదావరి జిల్లాలలో ఒకటైన తూర్పు గోదావరి జిల్లా, తునిలో ఆదివారం నాడు జరిగిన ఘటన అందరినీ కలిచి వేసింది. అయితే ఈ సంఘటన అప్పటికప్పుడు జరిగింది కాదని, దీని వెనుక కొన్ని రాజకీయ శక్తుల ప్లానింగ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.

“ఈ ఘటన వెనుక వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల హస్తం ఉందని, కాపుల రిజర్వేషన్ సున్నితమైన అంశమని, ఆ సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది విధ్వంస చర్యలకు కుట్ర పన్నారని, ఈ రాష్ట్రం ఏ ఒక్కరి సొంతమో కాదని, ఒక్క నేరగాడి వల్లే ఇదంతా జరిగింది, పులివెందులలో ఇలాంటి ఘటనలు సాధారణమేనని, అయితే ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లా, అది కూడా తునిలో ఈ ఘటన జరగడం ఊహకు అందనిదని” చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.

“వీళ్ళు జీవితంలో మారరు, కొన్ని రాజకీయ శక్తులు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని, కులాల మధ్య చిచ్చు పెట్టి కొన్ని శక్తులు రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని, రౌడీ మూకలు పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడడం సహించలేనిదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఓ పక్కన రాష్ట్రం ఉన్న పరిస్థితుల నుండి గట్టెక్కించాలని తానూ ప్రయత్నిస్తుంటే, మరో వైపు వీరంతా కూడి రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలని చూస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందని” హెచ్చరించారు.

కాపులకు రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని, దీనిపై కమిషన్ ఏర్పాటు చేసి దీన్ని సమీక్షించాలని కోర్టు ఆదేశించిందని, కోర్టులు కొట్టివేసే జీవోల వల్ల ప్రయోజనమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ఘటనతో తునిలో పరిస్థితి 144 సెక్షన్ అమలులో ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను, అదనపు పోలీసు బలగాలను కూడా రప్పించారు.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Madhavan’s OTT Reality Check: Dhurandhar Benefit Wasted?

Madhavan's GDN directed by Krishnakumar Ramakumar was released in theatres on August 7th and has…

10 minutes ago

The Family Man: Mirzapur Blockbuster Opens a New Door?

Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…

29 minutes ago