
తాజాగా ఈ జాబితాలో చేరింది… “అబ్బాయితో అమ్మాయి” హీరోయిన్ పల్లక్ లల్వాని. తన ఆల్ టైం అభిమాన హీరో మహేష్ బాబు అని, ఆయనతో కలిసి ఒక్క సీన్ లో అయినా నటించాలనేది తన అభిలాష అని పేర్కొంది పల్లక్. “అబ్బాయితో అమ్మాయి” ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించింది లల్వాని.
ఈ సినిమాలో చేసిన రొమాంటిక్ సీన్స్ ‘అభి – ప్రార్థన’ పాత్రల వరకే పరిమితమని, సినిమాలో ఇవన్నీ సాధారణమేనని చెప్తున్న ఈ ముద్దుగుమ్మ మాటలకు సినీ జనాలు నోరెళ్ళబెడుతున్నారట. మొదటి సినిమాతోనే ట్రేడ్ వర్గీయులను తన మాటలతో మాయ చేస్తోందని కితాభిస్తున్నారు పరిశీలకులు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కనుక ఆ మూడు పార్టీల నేతలు ఆ లెక్కలు కట్టుకుంటూ,…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu criticised YSRCP president YS Jagan Mohan Reddy over…