
తెలుగుదేశం పార్టీ దృష్ట్యా కాకుండా హైదరాబాద్ నగర ప్రజల రీత్యా ఆలోచనలుచేస్తే… చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపే విధంగా టిడిపికి ఆశించిన సీట్లు కట్టబెడితే నగర వాసులకు చేకూరే ప్రయోజనం ఏంటి? అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం టిడిపికి సహకరిస్తుందనుకుంటే అంత కంటే మరో భ్రమ ఉండదు. బహుశా ఇదే ఆలోచనలు హైదరాబాద్ వాసులు కూడా చేసినట్లున్నారు.అందుకే ఎలాంటి సంచలనాలకు తావు లేకుండా ఏకాభిప్రాయంతో టీఆర్ఎస్ కు పట్టం కట్టి కేసీఆర్ కు అభివృద్ధి యొక్క బాధ్యతలను అప్పగించారు.
చంద్రబాబు గతం తలచుకుంటే వచ్చేవి తీపిగురుతులే. కానీ, భవిష్యత్తుపై భరోసాకావాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు తప్పనిసరి. దీంతో టీఆర్ఎస్ పార్టీ
కురిపించిన వరాల వాగ్దానాలకు హైదరాబాద్ వాసులు ముగ్ధులై మేయర్ పీఠాన్నిఅప్పగించారని రాజకీయ విశ్లేషకులు విశదీకరిస్తున్నారు. ఇపుడు బాధ్యతంతా కేసీఆర్ పై ఉంది. ప్రజలు ఎంతో విశ్వసించి అప్పగించిన బాధ్యతను కార్యదక్షతతో పూర్తి చేసి, రాజకీయ నాయకులంటే నోటికొచ్చిన హామీలను ఇవ్వడమే
కాదు, వాటిని అమలు చేసి చూపించే వారు కూడా ఉన్నారని కేసీఆర్ నిరూపించాలి.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…