
“నేను బ్రాండ్లను అమ్మడంలో వీక్ అని, యాడ్ లో ఏదైనా వస్తువు గురించి చెప్పాలి అంటే… అది నిజంగా నాకు నచ్చి ఉంటేనే నేను చెప్పగలనని, కానీ, ఆ వస్తువు వంక చూస్తే నాకు చాలా సందేహాలు వస్తుంటాయని, నేను బ్రాండింగ్ చేయడం వలన కంపెనీ లాభాముండదని, అలాగే నేను తీసుకున్న డబ్బులకు సరైన న్యాయం కూడా చేయలేకపోయాయని, అందుకని ఒక ఏడాది తర్వాత తను ఒప్పుకున్న బ్రాండ్ ను వదిలేసుకున్నానని, ఆ ప్రోడక్ట్ మంచిదా… లేదా… అని తానూ అనుకోలేదని, నేను ఉపయోగించకుండా బ్రాండింగ్ చేయడం నా మనస్సాక్షి అంగీకరించదని” పవర్ స్టార్ చెప్పుకొచ్చారు.
“కానీ అద్దంలో చూసుకున్న ప్రతిసారి… కొందరు యాడ్ లు చేసుకుంటా డబ్బులు సంపాదిస్తున్నారు… నా దగ్గర డబ్బులు లేవు, నేను ఒక యాడ్ చేద్దామని అనుకుంటాను, అయితే మళ్ళీ నా మసస్సాక్షి ఒప్పుకోదని, నాకు యాడ్స్ చేయడం ఇష్టమే కానీ, నా మైండ్ అది చేయనివ్వదు” అంటూ పవర్ స్టార్ పగలబడి నవ్వుతూ చెప్పడంతో, ఇంటర్వ్యూ చేస్తున్న యాంకరమ్మ కూడా పవన్ నవ్వులతో జత కలిసింది. బహుశా నేను వేసుకున్న, షర్టుకో, జీన్స్ కో బ్రాండింగ్ చేయగలనేమోనని అన్న పవన్, ‘బ్రాండ్ అంబాసిడర్లు’గా మారిన ఇతర నటులను చూస్తే తనకు అసూయగా ఉంటుందని అన్నారు. “మీరు వాడుతున్న కారు కంపెనీకి ఫోన్ చేసి…” బ్రాండింగ్ అడగండి అనే మాటతో పవన్ సరదా ఇంటర్వ్యూ ముగిసింది.
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…