పవన్ 2 కోట్లు కంటే తక్కువ ప్రకటించారో… బుక్కయినట్లే..!

‘ట్విట్టర్’లో ఏం పెట్టాలో… ఏం పెట్టకూడదో… తెలిసిన వాడే రామ్ గోపాల్ వర్మ. చెన్నై బాధితులను ఆదుకోవడానికి పవన్ ముందుకు రాలేదన్న విషయం అందరికీ తెలిసిందే. బహుశా వర్మకు మాత్రమే తెలిసే విధంగా పవన్ ఆర్ధిక సాయం ప్రకటించారో ఏమో గానీ ఉన్నట్లుండి… చెన్నైను ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏకంగా 2 కోట్లు విరాళం ఇచ్చాడని చెప్తూ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశంసలతో ముంచెత్తిన విషయం గత 24 గంటలుగా హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ తేలిన విషయం ఏమిటంటే… అసలు పవన్ ప్రకటించలేదు. మరి వర్మ ఎందుకు ట్వీట్ చేసినట్లు? అన్న సందేహం కలుగక మానదు.

మెగా అభిమానులతో గతం నుండి విబేధాలు ఉన్న వర్మ, ఇటీవల జరిగిన ‘లోఫర్’ ఆడియో వేదికగా మెగా అభిమానుల ప్రవర్తనతో విసిగిపోయి, కావాలనే ఇదంతా చేసి ఉంటారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక, పవన్ విషయానికి వస్తే, ఎలాంటి ఆర్ధిక సహాయం గానీ, మాట సాయం గానీ చేయలేదన్న విషయం స్పష్టం. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ లో ఉన్నారు గనుక, వచ్చిన తర్వాత విరాళం అందజేస్తారని మెగా అభిమానులు సర్ధిచెప్పుకుంటున్నా… అదే జరిగి ఒకవేళ పవన్ 2 కోట్లు కన్నా తక్కువ ఆర్ధిక సాయం ప్రకటిస్తే… మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ‘ట్విట్టర్’లో బుక్కయిపోయినట్లే.

అంటే… ఓ రకంగా పవన్ ను, ఆయన అభిమానులకు వర్మ బాగా తెలివిగా ఇరికించారని ట్రేడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. భవిష్యత్తులో ఏకిపారేయడానికి కూడా ముందే అస్త్రాలను వర్మ సిద్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యక్షంగా పవన్ అభిమానులను, పరోక్షంగా పవన్ ను ఇరుకున పెడుతున్న వర్మ… ఎప్పుడైనా, ఎవరికైనా కనీసం 1000 రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారా అంటూ ‘ట్విట్టర్’ వేదికగా పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే వర్మ ప్రకటించారా… లేదా… అన్న విషయం ఎవరూ పట్టించుకోరు గానీ… పవన్ ముందుకు రాకపోతే.., ఒక సినీ నటుడిగా కాకపోయినా, ‘జనసేన’ అధినేతగా విమర్శల పాలవ్వక తప్పదని రాజకీయ విశ్లేషకుల భావన.

Share
Published by

Recent Posts

Vijaya Sai New Party: But Who’s The CM?

After being a crucial member in the team of former CM YS Jagan for more…

17 minutes ago

RGV’s Scary AI Take: What Will Humans Do Next?

Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…

37 minutes ago