‘బెంగాల్ టైగర్’లో పవన్ కళ్యాణ్ పై డైలాగ్స్!

pawan-kalyan-dailogues-in-ravi-teja-bangal-tiger-movieమాస్ మహారాజా రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన “బెంగాల్ టైగర్” సినిమా ఈ రోజు విడుదలైంది. రవితేజ అభిమానులకు పండుగలా, మాస్ వర్గీయులను అలరించే చిత్రంగా టాక్ తెచ్చుకుంది. తమన్నా, రాశి ఖన్నా అందాలు ప్రేక్షకులకు ‘కిక్’ ఇస్తుండగా, మాస్, యూత్ లలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పెట్టిన డైలాగ్స్ ధియేటర్లను దద్దరిల్లేలా చేస్తున్నాయి.

“సౌత్ ఇండియాలో రజనీకాంత్ కన్నా గొప్ప స్టార్ పుట్టడని అనుకున్నాం… ఇప్పుడు పవన్‌ కల్యాణ్ రాలేదా? పవన్ మొన్న ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే, జనం ఓట్లు గుద్దారు” అంటూ రవితేజ వేసిన డైలాగ్స్ పవన్ అభిమానులను ఆకాశంలో నిలబెడుతున్నాయి. అయితే, ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి కన్నా గొప్పవాడా? అలాగే పవన్ ప్రచారం చేయడం వల్లనే ఆ పార్టీ గెలుపొందిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనికి దర్శకుడు సంపత్ నందినే సమాధానం ఇవ్వాలి.

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ నుండి దర్శకుడిగా సంపత్ ను తప్పించినా, పవన్ పై తనకున్న భక్తిని ఈ విధంగా చాటుకున్నారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. యూత్, మాస్ వర్గాల్లో పవన్ కున్న క్రేజ్ ను వాడుకుని సినిమాను గట్టెక్కించుకునే చిన్న సినిమాల మాదిరి… రవితేజ కూడా పవన్ పేరును వినియోగించుకోవడం పై మాస్ మహారాజా అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా “బెంగాల్ టైగర్”లో పవన్ డైలాగ్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్స్ కు పవన్ పై డైలాగ్స్ కూడా ఓ కారణమవుతాయేమో..!

Share
Published by

Recent Posts

Vijaya Sai New Party: But Who’s The CM?

After being a crucial member in the team of former CM YS Jagan for more…

18 minutes ago

RGV’s Scary AI Take: What Will Humans Do Next?

Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…

38 minutes ago