
అవును… పవర్ స్టార్ అభిమానులు అన్నట్టు నిజంగానే ప్రిన్స్ మహేష్ బాబు నిరక్షరాస్యుడే. ఎందుకంటే… మహేష్ బాబు ఇంటర్మీడియట్ తప్పలేదు. ఒకవేళ అది పాస్ కాకపోయినట్లయితే మహేష్ కు ఆ ట్వీట్ లో సరిగా స్పెల్లింగ్ వచ్చేదేమో..! “ఇంటర్మీడియట్”తో ఆపేయకుండా… డిగ్రీ వరకు చదివిన నిరక్షరాస్యుడు ప్రిన్స్. అలాగే హీరోగా మారిన తర్వాత కేవలం హీరో క్యారెక్టర్లు మాత్రమే పోషించే చదువు రాని వాడు మహేష్. బహుశా “రచయిత”గా కూడా ఎదిగినట్లయితే… మహేష్ ఇలాంటి పొరపాట్లు చేసేవాడు కాదేమో..! ఒకవేళ మున్ముందు ఏ రాజకీయం పట్టుకుని వెళ్ళినా గానీ, “రచయిత”గా కూడా సినీ ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం మహేష్ కు దక్కి ఉండేది.
అలాగే… కుటుంబం కోసం రెండు, మూడు సంవత్సరాలు సినిమాలను కూడా వదిలిపెట్టిన జ్ఞానం లేని వ్యక్తి ఈ టాలీవుడ్ ప్రిన్స్ మరి! నిరక్షరాస్యుడు కావడం వలనే నిత్యం ‘పుస్తకాలు’ చదువుకుంటూ మరింత పరిజ్ఞానం కోసం పరితపిస్తూ ఉంటాడు. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లో మాత్రమే కాదు… చాలా విషయాలలో మహేష్ నిరాక్షరాస్యుడే.
ఆడియో వేడుకలపైన తనను ఎవరైనా పొగుడుతూ ఉంటే… ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని పగలబడి పగలబడి నవ్వడం తెలియని నిరక్షరాస్యుడు మహేష్. అంతేకాదు, అభిమానులను తన మాటలతో ఎలా మునగ చెట్టు మీద కూర్చోబెట్టాలో కూడా తెలియని అజ్ఞాని ఈ సూపర్ స్టార్. ఇలా చెప్పుకుంటూ వెళితే… పవర్ స్టార్ అభిమానులు చెప్పినట్టు మహేష్ “నిరక్షరాస్యుడు” అన్న విషయం బయటపడుతుంది. ఇది తెలియని వారు మాత్రం పవర్ స్టార్ అభిమానులను అదేదో ‘సామెత’ ఏంటది… అదే ‘పనిలేని….’ ఉంది కదా… దాంతో అన్న మాట..!
ఇంతకీ… మీరేమంటారు… అబ్బాయిలు…!
Vishwak Sen is heading into an unusual phase of his career. Not because he has…
Avengers Endgame is proving that a film does not always need a new release to…