
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అత్తిలిలో అభిమానులు ఏర్పాటు చేసిన పవన్ ఫ్లెక్సీలు రోడ్డుకు కాస్తంత అడ్డంగా ఉందన్న కారణంగా సదరు ఫ్లెక్పీని టీడీపీ కార్యకర్తలు తొలగించారట. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పవన్ అభిమానులు… ఫ్లెక్సీ చిరిగిపోయి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అక్కడే ఆందోళనకు దిగిన పవన్ అభిమానులు, ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడి ఫ్లెక్సీని తొలగించడమే కాక కింద పడేసి తొక్కిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. తమపై నిందలేస్తున్న పవన్ అభిమానులపై కేసులు నమోదు చేయాలని వారు కూడా ప్రతి నినాదాలు చేశారు. ఇరువర్గాలు రాత్రి పొద్దుపోయే దాకా అక్కడే బైఠాయించారు. గంటల తరబడి ఇరు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు ఎట్టకేలకు అర్ధరాత్రి దాటిన తర్వాత వారిని అక్కడి నుంచి పంపి, ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసారు.
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…
Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…