
ఓ పక్కన డబ్బులు లేవంటూ చెబుతూనే మరో వైపు పవన్ ఎక్కడికి రావాలన్నా స్పెషల్ ఫ్లైట్ లో చక్కర్లు కొడుతుండడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల తుని ఘటనపై స్పందించేందుకు (అసలు విషయం చిరు ఇంట వివాహా కార్యక్రమాల కోసం) కేరళ నుండి స్పెషల్ ఫ్లైట్ లో విచ్చేసారు. అలాగే ఇటీవల గుంటూరులో జరిగిన అంబటి రాంబాబు కుమార్తె వివాహా కార్యక్రమానికి హాజరైన సమయంలో కూడా స్పెషల్ ఫ్లైట్ లో రావడం విశేషం.
నిజానికి పవన్ ఉన్న స్థాయికి ఈ చర్చలు అర్ధరహితమైనవి. అయితే ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన ఏ విషయం ప్రస్తావించినా, ప్రస్తుతం తన వద్ద అంత ఆర్ధిక స్థోమత లేదని పవన్ చెప్తూ వస్తున్నారు. అందుకనే పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పవన్ అనుసరిస్తున్న రాజకీయ వైఖరిపై పొలిటికల్ వర్గాల్లో రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు హల్చల్ చేస్తూ సామాన్యుడి వరకు చేరితే, అవి నమ్మే పరిస్థితి నెలకునే విధంగా పవన్ విధివిధానాలు ఉంటున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ప్రస్తుతం నటిస్తున్న పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” ప్రీ రిలీజ్ మహిమ? లేక రాజకీయ అందదండలు మెండుగా ఉన్నాయా? పవన్ అభిమానులు సైతం మీమాంసలో పడే ప్రశ్నలు. ఏమంటారు… అబ్బాయిలు..?
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…