Telugu

పవన్ కళ్యాణ్… వాళ్లకి అవకాశం కల్పించాడు..!

‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఇచ్చిన ఫలితం ఇప్పటివరకు పవన్ పై విరుచుకుపడిన కమల్ ఖాన్ లాంటి వాళ్లకు మరింత ఊపునిచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు వరకు ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ పై ఒక రేంజ్ లో విమర్శలు చేసిన కమల్ ఖాన్, తాజాగా సినిమా విడుదలై ఫలితం వెలువడిన తర్వాత తన ట్విట్టర్ అకౌంట్ కు మరోసారి పని చెప్పాడు.

“హిందీని మరచిపోండి.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తెలుగులో కూడా ఆల్ టైం ఫ్లాప్ సినిమా అని నాకు రిపోర్టులు వస్తున్నాయి. ప్రజలు అలానే అంటున్నారు. సార్… మీ సినిమా ఫ్లాప్ తో మీరు ఇపుడు రెండు రూపాయల స్టార్ అయిపోయారు. ఇక నేను తీస్తున్న దేశద్రోహి-2లో నటిస్తే మరోసారి సూపర్ స్టార్ గా ఎదగొచ్చు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.

ADVERTISEMENT

ఈ చిత్రం విడుదలైన తరువాత అభిప్రాయాలు చెప్పాలని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, కమాల్ ఖాన్ తో పాటు, వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ ల అభిప్రాయాలను కూడా కోరగా, వాళ్లిద్దరూ ఇంకా స్పందించలేదు గానీ, కమల్ మాత్రం ఈ రేంజ్ లో ట్వీట్లు పెట్టాడు. దీనిపై అభిమానులు కూడా పెద్దగా స్పందించడానికి వీలు లేకుండా కమల్ ఖాన్ వంటి వారికి పవర్ స్టార్ అవకాశం కల్పించినట్లయ్యింది.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…

12 minutes ago

US Huge Scam: FBI Arrests Most Wanted Indian Kirana Owner

An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…

13 minutes ago