పవన్ కళ్యాణ్ కు అంత దమ్ము, ధైర్యం ఉందా?

“త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు…” గత రెండేళ్లుగా ఏదొక సందర్భంలో హల్చల్ చేస్తూనే ఉంది ఈ వార్త. తాజాగా కూడా మరోసారి తెరపైకి వచ్చింది. ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి ఏదొక కొత్త సినిమాను పవన్ అంగీకరించడంతో ఈ వార్తలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఒప్పుకున్నటువంటి నాలుగైదు సినిమాలను పూర్తి చేసిన తర్వాత సినిమాలను పూర్తిగా పక్కన పెట్టనున్నారని, అప్పటినుండి క్రియాశీలక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనేది తాజా ఉదంతం.

అయితే ‘జనసేన’ స్థాపించిన తొలినాళ్ళల్లో కూడా పవన్ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఒప్పుకున్న రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెడతానని, రెండు పడవల మీద ప్రయాణించడం తన వల్ల కాని విషయమని చెప్పుకొచ్చారు. అయితే అలా పవన్ చెప్పిన ఏ మాట మీద కూడా నిలబడలేకపోయారు. దీంతో తాజాగా వచ్చిన వార్తలకు కూడా పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. అధికారికంగా పవన్ చెప్పిన మాటలకే చోటు లేకపోతే, ఇక అనధికారికంగా హల్చల్ ఇలాంటి విషయాలకు అసలు విలువ లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT

అయితే పవన్ అసలు ఎందుకు ‘జనసేన’ను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు… అన్న ఆలోచనలు వస్తే… అసలు రాజకీయాలపై పవన్ కు మక్కువ ఉందా? ఒకవేళ ఉంటే అవి కేవలం టైం పాస్ రాజకీయాల వరకే పరిమితమా? లేక రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడమా? లేక ఒక నాయకుడిగా తనపై తనకు ఉన్న ‘నమ్మకమా?’ ఇలా అనేకానేక ప్రశ్నలు పవన్ ను పలకరిస్తున్నాయి. నిజంగా సినిమాలను వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి ప్రవేశించే దమ్ము, ధైర్యం పవన్ కు ఉన్నాయా? ఉంటే ఆ అవకాశాలు ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయో తెలుసుకోవాలంటే పవన్ పెదవి విప్పాల్సిందే!

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

58 minutes ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

4 hours ago