
ఈ క్రమంలో యాత్రకు హైప్ ఇచ్చి హిట్ చేసి నందమూరి, టీడీపీ అభిమానులను చిన్నబుచ్చాలని వారి ప్లాన్ అట. అయితే సినిమా వాసనలు పోకపోవడం వల్ల జరుగుతున్న అనర్ధాలు ఇవి అని పరిశీలకులు భావిస్తున్నారు. నందమూరి అభిమానులను ఇబ్బంది పెడతారు సరే కాకపోతే దీనివల్ల వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు ప్లస్ కదా, తద్వారా జనసేనకు నష్టమే కదా? వీరి చేష్టల వల్ల అసలు సొంత అభిమానులకే జనసేన గెలుపు మీద నమ్మకం లేదనే మెస్సేజ్ బయటకు వెళ్తుంది. ఇది జనసేనకు చాలా ప్రమాదం.
ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. ఈ సమయంలో ఇటువంటి చేష్టలు నష్టమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర.. మలయాళ మెగాస్టార్ మమ్మూటి వైఎస్సాఆర్ పాత్రలో నటించారు. సామాన్య ప్రేక్షకులకు కొంత బోర్ అనిపించినా ఈ సినిమా వైఎస్సాఆర్ అభిమానులకు మాత్రం అమితంగా నచ్చే సినిమా అంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ 2003లో చేపట్టిన పాదయాత్రను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని కొనియాడుతున్నారు.
పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల కష్టాలను వైఎస్సాఆర్ తెలుసుకున్న తీరును సినిమాలో చక్కగా చూపించారని, వైఎస్సాఆర్ పాత్రలో మమ్ముట్టి జీవించారని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మమ్ముట్టి ఉన్న కారణంగా సినిమా కేరళలో కూడా విడుదల అయ్యింది. రెండు భాషలలో విడుదల కావడం వల్ల సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉండొచ్చని కొంత మంది అభిప్రాయం పడుతున్నారు. రెండు భాషలలో కలిపి 13 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…
Since the official announcement of Allu Arjun and Lokesh Kanagaraj's tentatively titled AA23, fans have…