Telugu

పవన్ కళ్యాణ్ తో ఆ నిర్మాతలకు తలపోటు

తన తొలి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన తో పాటు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసినా రెండు సీట్లలో లోను ఓడిపోయారు. దీనితో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తారు అనే వదంతులు బాగా వ్యాపించాయి. అయితే పలుమార్లు పవన్ కళ్యాణ్ తనకు ఆ ఉద్దేశం లేదని ప్రజాసేవకే నా జీవితం అంకితం అని చెప్పుకొచ్చారు. అయినా ఆయన పునరాగమనం పై పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి.

అభిమానులను, ప్రజలను నమ్మించడానికి పవన్ కళ్యాణ్ తన గుబురు గెడ్డాన్ని కూడా తొలగించడం లేదు. గెడ్డం తీస్తే సినిమాలలోకి వస్తాడు అనే ఉద్దేశానికి వస్తారని ఆ అసౌకర్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ భరిస్తున్నారు. అయితే పవన్ కు గతంలో అడ్వాన్సులు ఇచ్చి ఆయన డేట్లు కోసం ఎదురు చూస్తున్న నిర్మాతల పరిస్థితి అడ్డా కత్తెరలో పావు చెక్క మాదిరి ఉంది. ఇచ్చిన డబ్బులకు వడ్డీలు చాంతాడంత అవుతున్నాయి. అదే సమయంలో తిరిగి ఇవ్వమని అడగలేరు.

ADVERTISEMENT

తిరిగి ఇచ్చేయమని అడుగుదామంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుంటే ఒక టాప్ హీరోతో సినిమా చేసే అవకాశం పోతుంది. దీనితో వారికి ఎటు పాలు పోవడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అస్థిరత్వానికి మారు పేరు. ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ ఐదు సంవత్సరాలలో చూపే నిగ్రహం, కమిట్ మెంట్ మీదే జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంది. సినిమాలు చేస్తే ఖచ్చితంగా జనసేనకు అది ఇబ్బందిగానే ఉంటుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Cyclone Arnab: CBN Puts Andhra Pradesh on High Alert

Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…

6 minutes ago

Nikhil Confident About Swayambhu’s Visual Effects

Nikhil Siddhartha has shared an update on his upcoming pan-India adventure, Swayambhu, confirming that the…

17 minutes ago