Telugu

పవన్ కళ్యాణ్ మొహమాటపడ్డాడు… మహేష్ పట్టేశాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి సీజన్ లో అన్ని డేట్స్ కంటే బెస్ట్ డేట్ సర్కారు వారి పాట అనే చెప్పుకోవాలి.

జనవరి 13 అంటే గురువారం విడుదల.. జనవరి 14 భోగి పండుగ రోజు మరియు దాని తరువాత వారాంతపు సెలవులు ఉంటాయి. కాబట్టి, సినిమా సంక్రాంతికి పూర్తి ఎడ్వాంటేజ్ పొందడానికి 13 వ తేదీ సరైన తేదీ అవుతుంది.

ADVERTISEMENT

ముందుగా పవన్ కళ్యాణ్ – రానా సినిమా ఈ తేదీకి విడుదల చెయ్యాలని అనుకున్నారు. అయితే సంక్రాంతి విడుదల అని చెప్పేసి ఊరుకున్నారు. దానితో ఆ డేట్ మహేష్ ఎగరేసుకుని పోయాడు. దానితో పవన్ కళ్యాణ్ 12న రావాల్సిన పరిస్థితి.

ఆ సినిమా 12న వస్తే… సర్కారు వారి పాటకు మొదటి రోజు థియేటర్లు కొంత ఇబ్బందే. అయితే లాంగ్ రన్ లో మాత్రం సర్కారు వారి పాట కే బెనిఫిట్… అయితే పవన్ సినిమా తరువాత మూడు సినిమాలు విడుదల అవుతాయి.

మూడు సినిమాలకు థియేటర్లు పోగొట్టుకుంటూ పోతే… ఎక్కువగా నష్టపోయేది ఆ సినిమానే అని చెప్పుకోవాలి. అనవసరంగా డేట్ అనౌన్స్ చెయ్యడానికి మొహమాటపడి పవన్ పెద్ద అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Ramayana Inside Reports: Great Visuals, Weak Emotions?

An alleged inside report on Bollywood's magnum opus Ramayana Part 1 claims that the film…

7 minutes ago

DSP’s Yellamma Set for Pre-Summer Release

Following the success of Balagam, National Award-winning filmmaker Venu Yeldandi is working on his next…

26 minutes ago